వసంత ఋతువు వచ్చింది
వసుధకు అందం తెచ్చింది
పచ్చ పచ్చని చిగుళ్ళతో
పరవశాన్ని కలిగించింది
వసంత ఋతువు వచ్చింది
అని చిన్నపుడు 3 వ తరగతి లో ఋతువుల గురుంచి చదువుకున్నాం. ఆరు ఋతువులు ఉంటాయి అని తెలుసు కానీ ఎప్పుడు అన్ని ఋతువులు మారడం చూడలేదు. ఒక్కో సీజన్లో ఒక్కోలా ఉండే జర్మనీ లో ఆ మార్పు స్పష్టం గా చూడొచ్చు.
మూడునెలలు చలితో, మంచుతో, ఆకులు రాలిపోయిన చెట్లతో ,నిరాశతో గడిపిన తర్వాత వచ్చే మొదటి సూర్యకిరణాలూ, పూసే మొదటి చిగురులు ఎంతో ఊరటని కొత్త ఆశని కలిగిస్తాయి.
జర్మనీలో స్ప్రింగ్ అంటే మొదటిగా మాట్లాడుకోవాల్సింది పువ్వుల గురుంచి. ఇక్కడి ప్రభుత్వం, నగరం లో చాలా చోట్ల ఎన్నోఅందమైన పూల చెట్లని నాటి మొత్తం నగరాన్ని ఎంతో అందం గ ముస్తాబు చేస్తారు.
పూల చెట్లు అనగానే ఎంతో చరిత్ర కలిగిన జపనీస్ చెర్రీ బ్లోస్సోమ్స్ గురుంచి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇక్కడి హోల్స్ వెగ్ అనే ప్రాంతంలోఈ చెట్లను రోడ్ లకి ఇరువైపులా ఎంతో అందంగా నాటారు. ఈ జపనీస్ చెర్రీ బ్లోస్సోమ్స్ ని సకురా అని అనేవారు. జపాన్ లో ఈ చెట్లని నాటడం ద్వారా ప్రజలకి మనశ్శాంతి ని తీసుకొస్తుంది అని నమ్మేవారు. జర్మన్ పునరేకికరణ తర్వాత డబ్బులు సేకరించి ఈ చెట్లని కొని బెర్లిన్ లో నాటించారు. ఆ తర్వాత జర్మనీ లోని అన్ని నగరాల్లో అమలు చేసారు. Bonn అనే నగరం ఈ చెట్లకి బాగా ప్రసిద్ధి.
.
.
కేవలం ఈ చెట్లే కాదు ఇంకా ఎన్నో రకాల పువ్వులుని చూడొచ్చు. ముఖ్యంగా చామంతి, తులిప్స్ మరియు డాఫోడిల్స్ ఎక్కువగా కనిపిస్తాయి.
.
.
.
.
.
.
వింటర్ లో ఎక్కువగా ఇంట్లోనే గడిపే ఇక్కడి ప్రజలు, స్ప్రింగ్ లో మాత్రం అందరు సూర్య రశ్మి ని ఆనందిస్తూ ఎక్కువ పార్క్స్ లో గార్డెన్స్ లో కూర్చొని రోజుని గడిపేస్తుంటారు.
.
మార్పు అనేది ఎక్కడైనా అవసరం అది మనుషులు అయినా ఋతువులు అయినా. భరించలేని చలి తో ప్రకృతినే కాదు మనుషులుని కూడా నిస్తేజంగా చేసే చలి కాలం నుంచి కొత్త ఉత్తేజాన్ని ఇస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించమని ప్రకృతి ఇచ్చే సందేశమే ఈ వసంత ఋతువు.
.
.
.
.
.
.
.
.